TG: హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో రాష్ట్ర కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శుక్లాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ గవర్నర్ శుక్లాకు పుష్పగుచ్ఛం అందజేసి శుభకాంక్షలు తెలిపారు.