TG: మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి శివారులోని ఓ కాలనీకి చెందిన వివాహిత(35) పట్టణంలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు పయనమైంది. తనకు తెలిసిన ఓ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బైక్పై వెళ్తుండగా లిఫ్ట్ అడిగింది. దీంతో వారు ఆమెను ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధిత మహిళ పీఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.