KRNL: మంత్రాలయంలో MPDO నూర్జహాన్, MRO రమాదేవి ఆధ్వర్యంలో మంచాల సొసైటీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి ఇవాళ ‘స్వచ్ఛరథం’ వాహనాన్ని ప్రారంభించారు. ఈ వాహనం గ్రామాల్లో ప్లాస్టిక్, స్క్రాప్ వంటి వ్యర్థాలను సేకరించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడనుందని పేర్కొన్నారు. ‘శుభ్రమైన మండలం-అభివృద్ధి చెందిన మంత్రాలయం’ లక్ష్యంతో ఈ పనులకు శ్రీకారం పుట్టినట్లు పేర్కొన్నారు.