గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కలెక్టరేట్ వద్ద నుంచి శనివారం నిర్వహించిన పోలియో అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారులు 2.12 లక్షల మంది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.