MHBD: జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయ కార్యనిర్వహణాధికారి శ్రావణపు సత్యనారాయణ తండ్రి లక్ష్మణస్వామి అనారోగ్యంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మణస్వామి అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం పాల్వంచలోని పెద్దమ్మతల్లి గుడి వద్ద ఉన్న వారి నివాసంలో జరుగుతాయన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.