AKP: వ్యవసాయ శాస్త్రవేత్తలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలని కృషి విజ్ఞాన కేంద్రం చైర్మన్ బి.శ్రీరామ్మూర్తి సూచించారు. రాంబిల్లి మండలం వెంకటాపురం కృషి విజ్ఞాన కేంద్రంలో సలహా సంఘం సమావేశం జరిగింది. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ ముకుందరావు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను సాగు చేయాలన్నారు.