TG: స్పీకర్ తనపై అనర్హత వేటు వేసినా పోరాటం ఆపనని ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా పోటీ చేయడం తన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎంతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. BRSకు వ్యతిరేకంగా ఏ రోజు పనిచేయలేదని, BRS తనకు ఎప్పుడూ విప్ జారీ చేయలేదన్నారు. స్పీకర్ పరిధిలో తాను ఎక్కడా పొరపాటు చేయలేదని తెలిపారు.