తనదైన లవ్ స్టోరీస్‌తో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ తేజ.. ఇక మాటలకే పరిమితమా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈయన మాటలేమో సూపర్ హిట్.. కానీ సినిమాలే దారుణం.. అనేలా మారింది పరిస్థితి. తేజనే కాదు.. ఈ విషయంలో ఆయన గురువు ఓ మెట్టు పైనే ఉన్నాడు. మరి తేజ పరిస్థితేంటి!?
అప్పటి వరకు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న’తేజ’..’చిత్రం’ సినిమాతో మెగా ఫోన్ పట్టి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత జయం, నువ్వునేను వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి.. లవ్ స్టోరీస్ సినిమాలకు కొత్త అర్థం చెప్పాడు. దాంతో కొంత కాలం టాలీవుడ్లో ప్రేమ కథ చిత్రాలు ట్రెండ్ సెట్ చేశాయి. అయితే తేజ మాత్రం ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. రీసెంట్గా దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌ను ‘అహింస’ అనే సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు. జూన్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియెన్స్ బాగానే హింసించింది. దాంతో అహింస డిజాస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తేజ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
‘ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ, తేజల సినిమాల కంటే వాళ్ల ఇంటర్వ్యూలు చాలా బాగుంటున్నాయి’ అంటు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వీళ్ల మాటలు సూపర్.. సినిమాలు మాత్రం ఫట్ అంటున్నారు. తేజ ఇంటర్య్వూ ఇస్తే.. అది యూట్యూబ్‌లో హిట్. ఎందుకంటే ఆయన మాటలు కుండబద్దలు కొట్టినట్టుగా ఉంటాయి. ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్పేస్తాడు. ఆయన ఏం చెప్పినా యూత్‌కు బాగా కనెక్ట్ అయిపోతుంది. కానీ సినిమాల విషయంలోనే తేజ నిరాశ పరుస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో సాలిడ్ హిట్స్ ఇచ్చిన తేజ.. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులు ఇస్తున్నాడు. అయితే ఆ మధ్యలో రానాతో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
దాంతో తేజ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడని అనుకున్నారు. కానీ మళ్లీ తేజ డిసప్పాయింట్ చేసేశాడు. సీత, అహింస సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. ఇంటర్వ్యూలు చూస్తే.. తేజ చాలా అప్డేటెడ్గా ఉన్నారనిపిస్తుంది. కానీ సినిమా విషయంలోనే ఇంకా మూస ధోరణిలోనే వెళ్తున్నాడని అంటున్నారు. దాంతో నెక్స్ట్ రానాతో అయినా మరోసారి హిట్ కొడతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక తేజ గురువు రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. మామూలుగా వర్మతో మాట్లాడాలంటే ఎవరి వల్ల కాదు. అంత తెలివిగా మాట్లాడతాడు వర్మ. కాని సినిమాల విషయంలో.. ఏంట్రా మా కర్మ అనేలా ఉంటాయి. అందుకే గురు, శిష్యుల మాటలు హిట్.. సినిమాలు ఫట్ అని అంటున్నారు.