TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తన ఫిట్నెస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 6 నెలలుగా పొట్ట దాచుకోవడం కష్టంగా మారిందని, అందుకే జిమ్ చేయడం ప్రారంభించానని తెలిపారు. ‘పొట్టను దాచుకోలేక విసిగిపోయాను. 6 నెలల గ్యాప్ తర్వాత జిమ్ చేయడం మొదలుపెట్టాను. జూలైలో నాకు 50 ఏళ్లు వస్తాయి. అప్పటికి మంచి ఫిట్నెస్తో ఉండాలని ఆశిస్తున్నా’ అని Xలో పోస్టు పెట్టారు.