SRCL: ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు అన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు ఎండీ సాజిద్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రంజాన్ ముస్లింలకు సోదరులకు పవిత్ర మాసమన్నారు.