India’s First Self Driving Car: ఇండియాలో మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ రెడీ
భారత్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఓ స్టార్టప్ కంపెనీ(Start Up company) ప్రారంభించింది.
అమెరికాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు(Self Driving Cars) దూసుకుపోతున్నాయి. అయితే ఆ టెక్నాలజీ(Technology) ఇంత వరకూ ఇండియా(India)లో లేదు. అయితే ఇప్పుడు భారత్‌లో ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఓ స్టార్టప్ కంపెనీ(Start Up company) ప్రారంభించింది. బెంగళూరు చెందిన మైనస్ జీరో సంస్థ జెడ్పాడ్ వాహనాన్ని(Zedpad Vehicle) అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు సైజు చాలా చిన్నగా ఉన్నా దేశంలో ఏ పరిస్థితుల్లోనైనా డ్రైవ్ చేయగలదని మైనస్ జీరో సంస్థ వెల్లడించింది.
ఈ కారులో స్టీరింగ్ వీల్ ఉండదు. ఆ స్టీరింగ్ కు బదులుగా హై రిసోల్యూషన్ కెమెరాల(Resoluti0n Camera)ను అమర్చారు. అవి ట్రాఫిక్‌తో పాటుగా డ్రైవింగ్(Driving) కండిషన్లలను కూడా కంట్రోల్ చేయగలుగుతాయి. ఇదొక లెవల్ 5 అటానమీతో కూడుకున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్(Self Driving Car) అని ఆ సంస్థ తెలిపింది. అయితే ఈ కారు లాంచింగ్ గురించి ఆ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఇక సెల్ఫ్ డ్రైవింగ్ కారు(Self Driving Car) విషయానికి వస్తే అసలు ఇది మనషుల ప్రమేయం లేకుండానే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతుంది. ఈ ఆటోనోమస్ కారు ప్రస్తుతానికి క్యాంపస్, పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వంటి క్లోజెడ్ ఏరియాల్లో ఉపయోగించొచ్చని, ఆ ప్రాంతాల్లో మాత్రమే దీనిని ఉపయోగించడానికి వీలుందని మైనస్ జీరో సంస్థ ప్రకటించింది. ఫుల్లీ-ఆటోనోమస్ వాహనాలకు ధీటుగా ఇండియాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల (Self Driving Cars)ను తీసుకురానున్నట్లు ఆ సంస్థ యమజాని గురుసిమ్రాన్ కాల్రా తెలిపారు. అయితే ఇండియాలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ జెడ్ పాడ్ కారు(Zedpad Vehicle)ను ఎప్పుడు లాంచ్ చేయనున్నారో మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు.