KNR: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా సిరిసిల్ల బైపాస్ రోడ్డులో గుంతల మరమ్మతులు చేపట్టినట్లు కరీంనగర్ ఏసీపీ వెంకటస్వామి తెలిపారు. అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. ప్రజా భద్రత దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.