GDWL: కేటిదొడ్డి మండలం కొండాపురం సమీపంలోని పాండురంగ స్వామి రైల్వే స్టేషన్ నుంచి నడిచే అన్ని డెమో (DEMO) రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు స్టేషన్ సూపరింటెండెంట్ జి.మునీందర్ తెలిపారు. ఈ రద్దు మార్చి 11 నుంచి మార్చి 31, 2026 వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను దీనికి అనుగుణంగా మార్చుకోవాలని ఆయన సూచించారు.