హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా ఇవాళ వేల్స్‌తో భారత జట్టు తలపడనుంది. పూల్-Bలో భారత్, స్కాట్లాండ్ చెరో 4 పాయింట్లతో తొలి 2 స్థానాల్లో ఉండగా.. మెరుగైన్ గోల్స్ డిఫరెన్స్‌తో మన సలీమా సేన ముందుంది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ డ్రా అయినా భారత్ సెమీస్‌కు చేరుతుంది. ఓడితే.. స్కాట్లాండ్-ఉరుగ్వే మ్యాచ్ ఫలితంపై ఆధారపడుతుంది.