GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్పోర్ట్స్ హాస్టల్ విద్యార్థులకు అందించిన భోజనంలో ఈగలు రావడం కలకలం రేగింది. మంగళవారం రాత్రి భోజనంలో ఈగలు రావడాన్ని గమనించిన విద్యార్థులు హాస్టల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అపరిశుభ్రమైన ఆహారంపై అధికారులను ప్రశ్నించినా.. స్పందన లేదని, ఇలాంటి భోజనం తిని అనారోగ్యం పాలైతే బాధ్యులెవరని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.