MDK: నర్సాపూర్ మండలంలోని చిప్పల్ తుర్తిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని విందును విజయవంతం చేశారు.