కోనసీమ: ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై కొన్ని అపోహలు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్నాయని వాటిలో ఎంత మాత్రం వాస్తవం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో గ్యాస్ కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదన్నారు. గ్యాస్ కంపెనీల ద్వారా సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని ప్రజలకు ఆమె తెలిపారు.