సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై మోతే మండలం మామిళ్లగూడెం టోల్ గేట్ వద్ద మంగళవారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎస్సై అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించడంతో పాటు, రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు.