VZM: ఈనెల 13న పట్టణంలో జరగనున్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయాలని AITUC నేత బుగత అశోక్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. స్దానిక అమర్ భవన్లో ప్రారంభం కానున్న ఈ సభలకు రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కార్మికుల సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని, ఈ సభలకు కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.