NZB: ఆలూరు మండలం కల్లెడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో జిల్లా హ్యాండ్బాల్ సంఘం ఆధ్వర్యంలో సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేశారు. ఈనెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో జరిగే 54వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని జిల్లా కోశాధికారి రాజేష్ మంగళవారం తెలిపారు. NZB జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు.