KMR: తప్పుడు నంబర్ ప్లేటుతో తిరుగుతున్న డీసీఎం వ్యాను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం శివారులోని జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ డీసీఎంను ఆపి తనిఖీ చేయగా, తప్పుడు నంబర్ ప్లేటుతో ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ గౌస్ పాషాను అదుపులోకి తీసుకున్నారు.