KDP: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కడప ఎస్పీ షెల్కే నచికేత్ హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పక ధరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు మీరిన వారిపై 274 కేసులు నమోదు చేసి రూ.56,615 జరిమానా విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కూడా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.