TPT: ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడుపేటలో పర్యటించి టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలిస్తూ హెలిప్యాడ్, సభా స్థలాలను అధికారులు తనిఖీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.