TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సృష్టి సరోగసీ కేసులో ED దూకుడు పెంచింది. డా. నమ్రత కుటుంబానికి చెందిన రూ.29.76 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. 2014 నుంచి అక్రమ సరోగసీకి పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.