KDP: ప్రస్తుతం దొంగతనాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సూచించారు. శనివారం పులివెందుల పట్టణంలోని స్థానిక పార్నపల్లె బస్టాండ్, కడప బస్టాండ్, తదితర ప్రాంతాలలో ప్రజలకు ఆయన దొంగతనాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు ఆభరణాలను ధరించి బస్సులలో ప్రయాణించరాదన్నారు.