ఆపద (Emergency) సమయంలో ఆదుకునేవాడు దేవుడు (God). ఒడిశా రైలు ప్రమాదం (Train Accident) విషయంలో ఎందరో మానవతామూర్తులు (Humanitarians) కదిలి వస్తున్నారు. ఘోర ప్రమాదం సంభవించడంతో వందల సంఖ్యలో ప్రయాణికులు (Passengers) తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆదుకునేందుకు ఒడిశా (Odisha) ప్రజలు కదిలివచ్చారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచారు. సహాయ కార్యక్రమాల్లో (Social Service) పాలుపంచుకోవడమే కాదు రక్తదానం, వైద్య సదుపాయం కల్పించేందుకు ముందుకు వచ్చారు. పెద్ద ఎత్తున మానవత్వం (Humanity) ప్రదర్శిస్తున్నారు.
బాలేశ్వర్ (Baleshwar) సమీపంలోని బహానగ బజార్ వద్ద శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు (Injured). క్షతగాత్రులను బాలేశ్వర్ లోని ప్రభుత్వ ఆస్పత్రితోపాటు పరిసర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించారు. బాధితులకు రక్తం (Blood) అవసరం ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన యువత (Youth) స్వచ్ఛందంగా రక్తదానం (Blood Donation) చేసేందుకు ముందుకువచ్చారు. ఆస్పత్రి ముందు రక్తం ఇచ్చేందుకు బారులు తీరారు. బాలేశ్వర్ ఆస్పత్రి ముందు రక్త నమూనాలు ఇచ్చేందుకు క్యూలో నిల్చున్నారు. వారి స్పందనను చూసి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆపద సమయంలో ఆత్మీయులుగా వచ్చిన వారిని అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇక ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు (Local People) పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. హాహాకారాలు చేస్తున్న ప్రయాణికులను కాపాడారు (Saved). బోగీల్లో చిక్కుకున్న వారిని అతి కష్టంగా బయటకు తీశారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి స్థానికులు ప్రమాదం నుంచి ప్రజలను బయటకు తీశారు. ఇక బాధితులను ఆదుకునేందుకు మరికొందరు సొంతంగా వాహనాలు సమకూర్చినట్లు తెలుస్తోంది. కావాల్సిన వారికి నీరు, ఆహారం కూడా అందించారని తెలుస్తోంది. ఆపత్కాలంలో యువత స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సామాజిక మాధ్యమాల (Social Media) వేదికగా స్థానిక ప్రజలపై ప్రశంసలు (Praises) కురుస్తున్నాయి.
Youth Congress’ workers providing all kinds of help to victims of Odisha train accident. They have arranged a blood donation camp in the hospital as per direction of @RahulGandhi Ji.. pic.twitter.com/sO273dxBBK