TG: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటు హక్కు లేకున్నా పోలింగ్ కేంద్రానికి BRS మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వచ్చారు. దీంతో అయనను గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు ప్రశ్నించారు. ఈ క్రమంలో భూపాల్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కాగా, సొంత ఊర్లో పట్టు నిలుపుకునేందుకు ఇరు వర్గాల నేతలు యత్నిస్తున్నారు.