Chakravyuham The Trap Movie Review: చక్రవ్యూహం ది ట్రాప్ మూవీ రివ్యూ
టాలీవుడ్ నటుడు అజయ్ కీలక పాత్రలో నటించిన చక్రవ్యూహం మూవీ ఈరోజు(జూన్ 2న)థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిసారిగా చెట్కూరి మధుసూధన్ రచన & దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
సీనియర్ యాక్టర్ అజయ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ చక్రవ్యూహం ది ట్రాప్. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి మధుసూదన్ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా శుక్రవారం (జూన్ 2న) థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. చక్రవ్యూహం ది ట్రాప్ సినిమాలో జ్ఞానేశ్వరి, ఊర్వశి పరదేశీ, వివేక్ త్రివేది ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ చిన్న సినిమా ఎలా ఉంది? అజయ్‌తోపాటు మిగిలిన నటీనటులు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించారో తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే.
కథ
చక్రవ్యూహం ది ట్రాప్ కథ ఒక మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా దర్యాప్తు చేసి నేరస్థులను పట్టుకుంటారు అనే దాని గురించి. సత్య (వివేక్ త్రివేది) ఆఫీసులో ఒక పార్టీకి హాజరైన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, అతని భార్య సిరి అకా శిరీష (ఊర్వశి పరదేశి) రక్తపు మడుగులో ఉన్నట్లు చూసి అతను షాక్‌కు గురవుతాడు. ఈ క్రమంలో సీఐ సత్యనారాయణ (అజయ్), ఎస్ఐ దుర్గా నాయక్ (జ్ఞానేశ్వరి కాండ్రేగుల)తో కలిసి కేసు దర్యాప్తు చేసి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆ ఆశ్చర్యకరమైన విషయాల్లో భాగంగా సత్య స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సంజయ్, అకౌంటెంట్ మల్లిక్, ఉద్యోగి శిల్ప (ప్రజ్ఞా నయన్), సిరి తాత (శుభలేక సుధాకర్), మాజీ తండ్రి శ్రీధర్ (రాజీవ్ కనకాల), సవతి తండ్రి శ్రీనివాస్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఎలా కనెక్ట్ అయ్యారు అనేది అసలు స్టోరీ. అసలు చక్రవ్యూహం ట్రాప్‌లోకి వారు ఎలా వెళ్లారనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ఎవరెలా చేశారు
హత్య కేసు దర్యాప్తు చేసే ఎస్ఐ పాత్రలో అజయ్ తన సత్తా చాటాడు. అతను తన బాడీ లాంగ్వేజ్‌కు కరెక్టుగా సూట్ అయ్యాడు. దీంతోపాటు కఠినమైన పోలీసుగా పరిపూర్ణంగా కనిపించాడు. అయితే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలంటే తన ఎక్స్‌ప్రెషన్స్‌లో కొన్ని వేరియేషన్స్ చూపించి ఉండాల్సింది. జ్ఞానేశ్వరి కాండ్రేగుల సీఐ పాత్రలో నటించగా, ఆమె తన పాత్రకు ఓకే. వివేక్ త్రివేది తన భార్య దారుణ హత్యకు గురైతే బాధను అనుభవించే పాత్రలో బాగా నటించాడు. మంచి ఎమోషన్స్. ఎక్స్ప్రెషన్స్ తో పాటు తన నటనలో ఇంటెన్సిటీ చూపించాడు. మరోవైపు దారుణంగా హత్యకు గురైన భార్యగా ఊర్వశి పరదేశి తన ప్రతిభను కనబరచడానికి కొంచెం స్కోప్ మాత్రమే ఉంది. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతకైనా తెగించే ఈర్ష్యతో పనిచేసే ఉద్యోగి పాత్రలో ప్రగ్యా నయన్ బాగుంది. ఆమె భావోద్వేగాలను చూపించింది. మరోవైపు శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రియా, శ్రీకాంత్ అయ్యంగార్, కిరీటి వంటి వారు పరిమిత స్క్రీన్ ప్రెజెన్స్ కల్గి ఉన్నారని చెప్పవచ్చు.
సాంకేతిక విభాగాలు
చేట్కూరి మధుసూధన్ ఎంచుకున్న చక్రవ్యూహం ది ట్రాప్ స్టోరీ. ఒక మర్డర్ మిస్టరీని మలుపులతో ఆశ్చర్యపరిచేలా ప్లాన్ చేశాడు. అతను సరైన నోట్లో కథనాన్ని ప్రారంభించాడు. ఆలస్యం చేయకుండా ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తూ ఆసక్తిని రేకెత్తించాడు. కానీ కథ తదుపరి స్థాయికి చేరుతుందని ఎవరైనా ఆశించినప్పుడు, స్క్రీన్‌ప్లే కొంచెం స్లోగా అనిపిస్తుంది. సమయం గడిచేకొద్దీ దర్శకుడు ఎక్కువ సమయం వృధా చేస్తున్నాడనే భావన వస్తుంది. జీవీ సినిమాటోగ్రఫీ బాగుంది. అజయ్ సంగీతం సందర్భానుసారంగా ఉంది. అతని BGM బాగానే ఉంది. కానీ సన్నివేశాలను మరింత ఇంపాక్ట్‌గా ఎలివేట్ చేసి ఉండవచ్చు. జెస్విన్ ప్రభు ఎడిటింగ్ బావుంది. డైలాగ్స్ ఓకే, సహస్ర క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ట్విస్ట్‌లు
అజయ్ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
కొన్ని రిపీట్ సీన్లు
ఇంకొన్ని ఊహించదగిన అంశాలు
కొన్ని ల్యాగ్ సీన్లు