NLG: బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ఆపార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గుంటి నరేష్, వార్డు సభ్యుల గెలుపును కాంక్షిస్తూ గ్రామంలో సోమవారం ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.