MDK: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని సమస్యలు పరిష్కరించడానికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే కన్వెన్షన్ సమావేశం విజయవంతం చేయాలని అధ్యక్షుడు రాము పిలుపునిచ్చారు. బుధవారం పాలమూరు విశ్వవిద్యాలయంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 7,8,9 తేదీలలో పాలమూరు వర్సిటీలో సమావేశం ఉందని, రాష్ట్రంలోని అన్ని వర్సిటీల విద్యార్థులు పాల్గొంటారన్నారు.