ELR: వట్లూరులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు విద్యార్థులకు మానవ హక్కుల చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ పాల్గొని విద్యార్థులకి చట్టాలపై అవగాహన కల్పించారు. చట్టం మనిషికి ఒక ఆయుధం వంటిదని, పౌరుల రక్షణకు చట్టం అనే ఆయుధం ఎంతో ముఖ్యమని తెలిపారు.