అన్నమయ్య: జిల్లాలో సొంత భూములు కలిగిన భూయజమానులు జాయింట్ ఎల్పిఎం కోసం ఈ నెల 31 లోపు తప్పనిసరిగా సచివాలయాలు లేదా మీ -సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జేసీ ఆదర్శ రాజేంద్రన్ ప్రకటించారు. ప్రస్తుతం డిసెంబర్ 31 వరకు దరఖాస్తు రుసుం రూ. 50 మాత్రమే ఉండగా.. ఆ తర్వాత ఇది రూ. 550కి పెరుగుతుంది. భూ యజమానులు వెంటనే దరఖాస్తులు సమర్పించాలని JC సూచించారు.