NRPT: జిల్లాలోని మద్దూరు, కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి మండలాలలో గురువారం మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. 67 గ్రామ పంచాయతీలు, 572 వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఎన్నికలలో ఎలాంటి ఘటనలను జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఉ. 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుండగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి నుండి ఫలితాలు వెల్లడికానున్నాయి.