అండర్-19 ఆసియాకప్లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేశాడు. 56 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 9 సిక్సర్లు, 5 ఫోర్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. 20.2 ఓవర్లకు భారత్ ప్రస్తుత స్కోరు 158/1గా ఉంది. వైభవ్ సూర్యవంశీ(100*), ఆరోన్ జార్జ్ (48*) క్రీజులో ఉన్నారు.