MDK: ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మనోహరాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వడ్ల కొనుగోలు నెమ్మదించడంతో పండిన పంట గిట్టుబాటు కాక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి ఎప్పుడు కొంటారో అని ఎదురుచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.