MDK: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గణేష్ నగర్ కు చెందిన కోహెడ పర్శరాములుగౌడ్, మద్యానికి బానిసై పని చేయకపోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రితం భార్యతో గొడవ జరిగిన తర్వాత, గురువారం భార్య కుమార్తెను కళాశాలకు వదిలి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ వివరాలు సేకరించారు.