NLR: అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని మంత్రాలయం మండల అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి భీమేశ్వరి డిమాండ్ చేశారు.జిల్లా కార్యదర్శి నిర్మలమ్మ పిలుపు మేరకు నియోజకవర్గం నుంచి సుమారు 90 మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్నారు.తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ డాక్టర్ సిరికి ఇచ్చారు.