CTR: అల్లూరి జిల్లాలో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో చిత్తూరు వాసులు మృతి చెందడంపై ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం చిత్తూరు గిరింపేట మరాఠి వీధిలోని మృతుల నివాసాల వద్దకు వెళ్లి బంధువులను పరామర్శించారు. ప్రమాద ఘటన, మృతుల వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు తెలుసుకున్నారు.