W.G: భీమవరం కలెక్టరేట్ కార్యాలయం వద్ద శుక్రవారం అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఐటీయు నాయకులు మద్దతు తెలియజేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని అన్నారు. గత 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఇచ్చిన హామీలు అమలకు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అంగన్వాడీలను మోసం చేసిందన్నారు.