GNTR: తెనాలి నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి CMRF ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ శుక్రవారం అందజేశారు. కంచర్లపాలెంకి చెందిన నాగలక్ష్మీకి రూ.1.50 లక్షలు, పట్టణానికి చెందిన పఠాన్ రమీజాబీకి రూ.1.20 లక్షల చొప్పున లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు కాగా బాధితులకు అందజేశారు. ఇందులో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.