GNTR: తాడికొండలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ పాల్గొన్నారు. ఆయన బాప్టిస్ట్ చర్చి సంఘస్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి పంపిణీ చేశారు. క్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గాలలో ప్రజలు నడవాలని ఎమ్మెల్యే శ్రావణ్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు.