BHNG: రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ, ఎన్నారంలలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మిర్యాల మల్లేష్, మెట్టు అరుంధతిలకు మద్దతుగా శుక్రవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మొదటి విడత జరిగిన ఎన్నికల్లో పలు గ్రామాల్లో ఎదురు దెబ్బ తగిలిందని, ప్రజలు గుర్తించి బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు.