KKD: శెట్టిబలిజిపేట- NH మార్గంలో NRGS నిధులు రూ. 65 లక్షలతో జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుక్రవారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారుల మరమ్మతు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. వైసీపీ పాలనలో రహదారుల దుస్థితితో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు నాణ్యతతో పనులు జరుగుతున్నాయని చెప్పారు.