TG: సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదు. హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి కోర్టు ఉత్తర్వులు తెలియవా? సీనియర్ అధికారులు కూడా ఎందుకు ఇలాంటి మెమోలు జారీ చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత విత్ డ్రా ఎందుకు?’ అని ప్రశ్నించింది. అనంతరం హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చింది.