MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్ రోజు వేలాది మంది ఆకలి తీరుస్తుంది. HYD సిటీలో సాధారణంగా ఉదయం 9 గంటల వరకు రూ.5 టిఫిన్ అందజేస్తారు. కానీ.. ఇక్కడ అత్యధిక డిమాండ్ ఉండటంతో ఉ.10 గంటల వరకు సైతం టిఫిన్ అందుబాటులో ఉంటుంది. టిఫిన్ పూర్తయిన వెంటనే మధ్యాహ్న భోజనం సైతం అందిస్తుండడం గమనార్హం. దీనిపై స్థానికులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.