NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సెమిస్టర్ ఫలితాలను శుక్రవారం విడుదల చేసి కళాశాల వెబ్ సైట్ ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రవి తెలిపారు. కళాశాల మొత్తంగా 50.83 శాతం ఉత్తీర్ణత పొందారని చెప్పారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూశామన్నారు.