నెల్లూరు జిల్లాలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. టీపీగూడూరు మండలం వరకవిపూడికి చెందిన ఈదూరు నరేశ్ (34), ప్రమీలమ్మ (28) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం కలహలతో చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇద్దరూ ఇంట్లోనే ఒకే చీరకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.