విశాఖలో ఈనెల 31 నుంచి వచ్చే నెల నాలుగవ తేదీ వరకు జరిగే అఖిలభారత సీఐటీయూ మహాసభలపై పరవాడలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. అలాగే విరాళాలు కూడా సేకరిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి తెలిపారు. కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పనిగంటల పెంపును తగ్గించాలన్నారు.