AP: విశాఖ సమ్మిట్‌లో 613 MoUలు వచ్చాయని CM చంద్రబాబు అన్నారు. ‘రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. కంపెనీలు అన్ని ప్రారంభమైతే 20 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. 2032 నాటికి విశాఖలో 125-135 బిలియన్ డాలర్లకు ఎకానమి చేరుకుంటుంది. విశాఖ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తయారవుతుంది. ఓర్వకల్లో డ్రోన్ సిటీని తీసుకొస్తున్నాం’ అని పేర్కొన్నారు.