అండర్-19 ఆసియాకప్లో భాగంగా యూఈఏతో టీమిండియాకు జరుగుతున్న మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీతో మెరిశాడు. 95 బంతుల్లో 171 పరుగులు చేసి చేసి పెవిలియన్ చేరాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం 40 ఓవర్లకు భారత్ 3 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.